logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కుమ్మరి మల్లన్న జాతరలో రెండు నెలల పాప చంపిన కాంగ్రెస్ పార్టీ నేతలు.

హైదరాబాద్:కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ గుండాల పాశవిక దాడికి ఓ పసికందు బలైపోవడం తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచింది. ఈరోజు నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ కిరాతక ఘటనపై స్పందించాను. గణేష్-మౌనిక దంపతుల కడుపుకోతకు, రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

హోంశాఖ ముఖ్యమంత్రిగారి వద్దే ఉన్నా, ఇంతటి ఘోర ఘటనపై సీఎం మరియు అధికార పార్టీ నేతలు మౌనం వహించడం వారి చేతకానితనానికి నిదర్శనం.

BJP Telangana పక్షాన మా స్పష్టమైన డిమాండ్లు:

1. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.

2. బాధిత కుటుంబంపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి.

3. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ప్రజలకు బహిర్గతం చేయాలి.

4. సమగ్రంగా మరియు నిష్పాక్షికంగా మేజిస్ట్రియల్ విచారణ జరపాలి.

5. తమ విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

6. బాధిత కుటుంబానికి తక్షణ ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించాలి.

7. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించాలి.

8. శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులకు దీర్ఘకాలిక ఆర్థిక మరియు సామాజిక భరోసా కల్పించాలి.

పసికందు ఉసురు తీసిన ఈ పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే న్యాయం జరగకపోతే బీజేపీ పక్షాన రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమం తప్పదు.

0
24 views

Comment