
షార్ట్ న్యూస్.
హైదరాబాద్:> విజయవాడ: భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి. ట్యూషన్‌కి వెళ్లకుండా ఆటోలో బస్టాండ్‌కు వెళ్లిపోయిన పిల్లలు. ఇంట్లో క్యాష్ తీసుకొని వెళ్లిపోయిన మేరారామ్ (12), ఉమారామ్ (13). నిన్న విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన పిల్లలు. ముంబై నుంచి గుజరాత్ వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు. పిల్లలు దొరకడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.
> ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం. దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన. రేపు, ఎల్లుండి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు. పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
> అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ట్రంప్ టారిఫ్‌లను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు. సుంకాలు విధంచే హక్కు అధ్యక్షుడికి లేదన్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో భారీ లాభాల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు.
> ట్రంప్ సుంకాలను వ్యతిరేకించిన ఆరుగురు జడ్జీలు. ట్రంప్ టారిఫ్‌లను సమర్థించిన ముగ్గురు జడ్జీలు. మాట వినని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించిన ట్రంప్. అదనంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశం. భారత్‌పై విధించిన 18శాతం టారిఫ్ కూడా అనధికారమన్న అమెరికా సుప్రీంకోర్టు.
> నేడు వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకి అనంతగిరి హిల్స్ చేరుకోనున్న సీఎం రేవంత్.. హరిత రిసార్ట్స్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు.. తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్.. సాయంత్రం 4గంటలకి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి..