logo

జిహెచ్ఎంసి ఎలక్షన్లో దూసుకుపోతున్న బిజెపి.

హైదరాబాద్: 📍ఆమన‌గల్, రంగారెడ్డి జిల్లా

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని ఆమన‌గల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గత 12 ఏళ్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు ఏరకంగా మోసపోయాయో వివరించాను. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్, విద్యార్థినీలకు స్కూటీలు, ఆడబిడ్డలకు తులం బంగారం, కౌలు రైతులను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏరకంగా వెన్నుపోటు పొడిచాడో వెల్లడించాను.

బీఆర్ఎస్ కుటుంబ పాలన, కాంగ్రెస్ అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారనడానికి పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే నిదర్శనమని స్పష్టం చేశాను.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను పాతరేసి బీజేపీ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపిస్తే..గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి సహకారంతో తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని స్పష్టం చేశాను.

0
66 views