logo

77 వ, ఘన తంత్ర వేడుకల లో పాల్గొన్న సముద్రపు రామారావు

నగరపంచాయతీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

స్వతంత్ర భారతం గణతంత్ర రాజ్యంగా అవిర్బవించిన సుదినం

చైర్పర్సన్ సరోజిని, వైస్ చైర్మన్ రామారావు

77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ కమిషనర్ ఎస్. జనార్దన్రావు చేతుల మీదుగా జరిగిన పతాకావిష్కరణలో చైర్పర్సన్ బంగారు సరోజిని,వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు మరియు పట్టణ పెద్దలు లెంక అప్పలనాయుడు పాలకవర్గ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ హోదాల్లో హాజరైన పెద్దలు,నగర పంచాయతీ, మెప్మా మరియు వార్డు సచివాలయల సిబ్బంది పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైస్ చైర్మన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ....
స్వతంత్ర ఆలోచనలు, స్వయం సమృద్ధి సాధన, సమిష్టి సంకల్పం, సంతులన న్యాయం వంటివి మూలభావనలుగా ఏర్పడిన రాజ్యాంగాన్ని గౌరవించే పర్వదినంగా నిర్వహించుకుంటున్న ఈ వేడుక మనందరిలో ఆ భావాలను ప్రేరేపించి సమున్నత లక్ష్యాల సాధనకు ముందుకు నడిపించాలని అందుకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, నగర పంచాయతీ పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్నీ కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వివిధ హోదాల్లో విచ్చేసిన గౌరవ పెద్దలు, నగర పంచాయతీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, ఇతర పెద్దలు పాల్గొన్నారు.

1
1044 views