ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన న.
హైదరాబాద్:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ గారు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో కొద్దిసేపు సమావేశమయ్యారు.❇️ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ సందర్భంగా, యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ గారు అభినందించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యాదవ సమాజం ముఖ్యమంత్రి గారిని గుర్తుంచుకుంటుందని పేర్కొంటూ, యాదవులకు ఇచ్చిన ప్రాధాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.❇️ ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.