logo

గిరిజన విద్యార్ధుల ప్రాణాల తో చెలగాటమాడు తున్న కూటమి ప్రభుత్వం.

ఈ రాష్ట్రంలో మరొక బావి భారత పౌరురాలు నేలకొరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు21 మంది గిరిజన విద్యార్థుల మృతి చెందడం చాలా విచారించదగ్గ విషయం, ఈ నెలలోనే మరణించిన విద్యార్థుల సంఖ్య 6 కు చేరడం చాలా బాధాకరమైన విషయం. గిరిజన గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, విద్యార్థులకు దోమతెరలు సక్రమంగా పంపిణీ చేయకపోవడం, హాస్టల్లో తలుపులు, కిటికీలు లేకపోవడం, త్రాగునీటి సమస్య, సరైన మెనూ అందించడం లేకపోవడం వలన గిరిజన విద్యార్థులు ప్రాణాలంటే లెక్క లేకపోవడం చాలా ఘోరమైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోకపోవడానికి నిదర్శనమే ఈ మరణాల సంఖ్య. హాడ్డుబండి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మండలంగి కవిత(11) జ్వరంతో చనిపోవడం ఈ ప్రభుత్వం దళితులపై ఆదివాసీలపై ఎంత శ్రద్ధ ఉందో అనడానికి నిదర్శనం. వెంటనే ప్రభుత్వం కళ్లు తెరిచి సంబంధ శాఖ మంత్రి గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి సురక్షిత మంచినీరు, నాణ్యమైన ఆహార పదార్థాలు, మెరుగైన వైద్యం అందించి భావి భారత పౌరుల ప్రాణాలను కాపాడాలని, విద్యార్థులు ప్రాణాలకు రక్షణ కల్పించాలని, సంబంధిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని జై భీమ్ రావ్ భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు టొంపల నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది.

1
115 views