బిజెపి పార్టీ ఆఫీసు పైన చేసిన దాడిని ఖండించిన ఈటల రాజేందర్ గారు.
హైదరాబాద్ : బిజెపి పార్టీ పైన దాడి చేసిన కాంగ్రెస్ వాటినే ఖండించిన ఈటెల. ప్రకటన : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ? మీ ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా లేదా ? పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంసృతి సిగ్గుచేటు. మీ పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. గుండాల మాదిరిగా దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాను.BJP Telangana Bharatiya Janata Party (BJP)