logo

93 బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు 30 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళన .

హైదరాబాద్ : 30 సంవత్సరాల 93 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం.
మద్దికేర : మద్దికేర జెడ్ పి హెచ్ హై స్కూల్ బాలరు పాఠశాలలో ఆదివారం రోజు 93 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద పండగ వాతావరణం ఏర్పడినది ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విద్యార్థులు అందరూ విచ్చేసి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది ఒకరు కోరుకోరు అలైబలై చేయడం జరిగింది మరియు ముఖ్యంగా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు వారి పాత కష్టాలను గుర్తు చేసుకొని కంటి నీరు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం చాలామంది ఎంతో మంచి హోదాలో ఉన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా వ్యక్త పరచడం జరిగింది మరియు విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో ప్రైవేట్ సెక్టార్ మరియు గవర్నమెంట్ సెక్టార్ లో చాలామంది పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని మన విద్యార్థులు అందరికీ పేరుపేరునా కలుసుకోవడం జరిగింది మరియు భవిష్యత్తులో మన పిల్లలకు ఊరుకోరు సహాయ సహకారాలు అందించుకోవాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
మరియు 93 బ్యాచ్ కొంతమంది విద్యార్థులు మరణించినారు విద్యార్థులు మరియు కొంతమంది ఉపాధ్యాయులు మరణించారు వారందరు గుర్తు చేసుకుని వారికి రెండు నిమిషాలు 93 బ్యాచ్ తరఫున ప్రగాఢ సంతాపం తెలపడం జరిగింది.
మరియు 93 బ్యాచ్ లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కొద్ది వరకు ఆర్థిక సాయం చేయడానికి ఈ బ్యాచ్ తరఫున నెలకు 100 రూపాయలు ప్రతి ఒక్కరూ మన బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ పంపించాలని నిన్న సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరు విద్యార్థులు ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరియు మధ్యాహ్నం మంచి రుచికరమైన వంటలు చేయించి అందరూ అక్కడే అన్నం భోజనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం కోసం స్కూలు వారు మాకు టైం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కమిటీ సభ్యులు.
సురేష్ కుమార్ యాదవ్ 93 బ్యాచ్ చైర్మన్.
మరియు కొంతమంది అడ్మినిస్ మంచిగా వర్క్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పాత్ర మహిళలది వారు చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు.

0
0 views