logo

AIMA VIZAG NEWS BIG BRAKING NEWS ఈ ఒక్క రోజే అతిపెద్ద పగటి రోజు 13 గంటల 7 నిమిషాల పాటు పగలు గుడివాడలో తొ

AIMA
VIZAG NEWS


BIG BRAKING NEWS


ఈ ఒక్క రోజే అతిపెద్ద పగటి రోజు

13 గంటల 7 నిమిషాల పాటు పగలు
గుడివాడలో తొలి సూర్యోదయం
నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.

ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ
ఈ నెల 21వ తేదీ మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.

ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.


పురోహిత అర్చకులు కోసం అనేక కార్యక్రమాల్ని ఈ కింద నిచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే అన్ని అందుబాటులో ఉంటాయి.https://youtube.com/@GTCN143


మీ ప్రకటనలు కూడా ఉచితంగా వేయబడటం జరుగుతుంది మమ్మల్ని కన్సల్ట్ చేయవలసిన నెంబరు 9618688312.9010243952

58
3127 views
  
1 shares