
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర నా
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. తమ జీవితాలను త్యాగాలను చేసి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్కు జర్నలిస్టుల సంక్షేమం గుర్తుకురావడంలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారని, కానీ జర్నలిస్టులు గుంటెడు జాగా ఇవ్వడానికి మనస్సు ఒప్పడంలేదా అంటూ నిలదీశారు. పేదలు, జర్నలిస్టులకు దక్కాల్సిన భూములను బడా వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి తాను అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెడిపట్ల సురేష్, షేక్ మోయిజ్, జర్నలిస్టులు సుధాకర్, సుభాష్, రోడ్డ దేవిదాస్, గంట వినోద్, రాజేష్, షాహిద్, సిడాం రవి, అవునూరి దత్తాత్రి, అస్మత్ అలీ, దేవేందర్, అభిలాష్, వెంకటేష్, నిలేష్, అనిల్, శ్రీకాంత్, వెంకట్, కిజర్ అహ్మద్, మహేష్,తదితరులు పాల్గొన్నారు.