
AIMA
VIZAG NEWS
అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా జె.కే.రత్నరాజు గారు.
శుభాకాంక్షలు తె
AIMA
VIZAG NEWS
అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా జె.కే.రత్నరాజు గారు.
శుభాకాంక్షలు తెలియజేసిన ఇతర ఇన్చార్జులు మరియు కార్యకర్తలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా
అరకులోయ AIMA న్యూస్ ప్రతినిధి
16/ 02/2023 : అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా అరకులోయ అసోసియేషన్ సభ్యుడుగా జె.కె. రత్నరాజు గారు ని నియమించినట్లు అరకు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి వర్యులు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. గురువారం ఫోన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కి రత్నరాజు ఎన్నో ఏళ్ల నుండి సేవలను అందిస్తున్నారని, ఈ సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనను అరకు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడి గా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జె.కె. రత్నరాజు గారు గుర్తించి అరకు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులుగా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదిలా అరకులోయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షతగా నియామకమైన రత్నరాజు గారు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. టిడిపి బలోపేతానికి రేయిం బవల్లు కృషి చేస్తానని చెప్పారు. కాగా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అభిమానులు రత్నం రాజుకు అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర తరఫునుండి బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు పురోహిత బ్రాహ్మణ సమైక్య అర్చకులు అతన్ని ఆశీర్వదించడం జరిగింది. వైజాగ్ మరియు విజయనగరం మరియు అరకు వ్యాలీ ఇన్చార్జ్ బ్రాహ్మణ ఇంచార్జ్ అండ్ సెక్రటరీ గారు ఏలూరి వెంకటరమణ మూర్తి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.