logo

బతుకమ్మ చీరల పంపిణీ పై ఎంపీపి పెత్తనం

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే నాసిరకం చీరలు మాకొద్దని మహిళలు అనగానే కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక మహిళలను అవమాన పరుస్తూ చీరలు తీసుకోకుంటే మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని,పింఛన్లు కూడా వీళ్లకు ఇవ్వొద్దని అధికారులకు హుకుం జారీ చేశారు.

చీరలు ప్యాక్ చేసి తీసుకెళ్ళండని ఎవ్వరు అడిగిన చీరలు ఇవ్వొద్దని ఆర్ ఐ ని ఆదేశించారు.మహిళలు ఆగ్రహం తో సమావేశం నుండి శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోవడంతో ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు, జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మహిళలను రమ్మని పిలిచినా ఎవ్వరు తిరిగి రాకపోవడంతో అధికారులు,ప్రజాప్రతినిధులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

0
18112 views