VDC ల ఆధ్వర్యంలో రహస్య వేలంపాట
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకట్రావుపేట గ్రామ శివారులో పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసేందుకు VDC ల ఆధ్వర్యంలో సోమవారం గ్రామ శివారులో రహస్య ప్రాంతంలో వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రు. 15 లక్షలకు ఏడాది పాటు టెండర్ ను దక్కించుకున్నాట్లు తెలిసింది. ఈ విషయమే స్థానిక తహసీల్దార్ రవీందర్ ను వివరణ కోరగా టెండర్ టెండర్ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో వెంటనే వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ నుంచి ప్రజలను, VDC వాళ్ళను హెచ్చరించారు. తహశీల్దార్ హెచ్చరించిన వారు వినకుండా వేలం నిర్వహించారు.