logo

మంజుల అక్క యువసేన కార్యకర్తల ముఖ్య సమావేశం

మంజుల అక్క యువసేన కార్యకర్తల ముఖ్య సమావేశం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మంజుల అక్క యువసేన ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మంజుల రెడ్డి ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న సేవలకు అండగా నిలిచేందుకు కొంతమంది యువకులు కలిసి మంజుల అక్క యువసేన - హుస్నాబాద్ ను ఏడాది క్రితం ఏర్పాటు చేశారు.

ఇటీవలే యువసేన ముఖ్య కార్యాలయాన్ని హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ప్రారంభించారు. నేడు అనగా గురువారం పది గ్రామాలకు సంబంధించిన మంజుల అక్క యువసేన ముఖ్య కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ గురించి సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి సమావేశమై చర్చించారు.

12
16796 views
  
4 shares