logo

ఎంపవర్ విత్ సోషల్ మీడియా ఇనగరల్ వర్కుషాప్ కార్యక్రమం మామిడి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

శ్రీకాకుళం, వైఎస్ఆర్ కళ్యాణ మండపం.... ఎంపవర్ విత్ సోషల్ మీడియా ఇనగరల్ వర్కుషాప్ కార్యక్రమం రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఐటీ అండ్ సోషల్ మీడియా ఇండస్ట్రీ ప్రిన్సిపాల్ కన్సల్టెంట్ మామిడి సురేష్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిధి మామిడి సురేష్ గారు పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా సోషల్ మీడియా ఛాంపియన్స్ కు పలు అంశాలను తెలియజేసారు ప్రధానంగా సోషల్ మీడియా అంటే ఎదో ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం,ఒక వ్యవస్థ కోసం, ఒక సంస్థ కోసమే కాకుండా ఒక సంఘటితగా ఏర్పడి వేరే వేరే ఆలోచన చేసి ముందుకు వెళ్లగలిగితే ఒక శక్తిగా ఎదగవచ్చు రెవెన్యూ సోర్స్ ఏర్పడుతుంది అని టైం చాలా ఇంపార్టెంట్ అని దానిని వృధా చేయవద్దు అని మనందరం ఒక నెట్వర్క్ గా ఏర్పడితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఫండ్ రేజ్ చేయడానికి ఉన్నారు అని పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా తెలియజేసారు మధ్యలో సోషల్ మీడియా ఛాంపియన్స్ కి వారి అనుభవాలను, స్కిల్స్ ఇతర అంశాల మీద పలువురిని మాట్లాడించి సూచనల సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ నేటి సమాజంలో రాజకీయ పార్టీ అయిన నాయుకుడు అయిన వ్యాపారస్తుడుకి అయిన స్వచ్చంద సంస్థలకు అయిన సోషల్ మీడియా ఒక భాగం ఐపోయింది అని దాని కింద స్థాయిలో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ రెవెన్యూగా మలుచుకోవడంలో విపలవుతున్నారు అని మామిడి సురేష్ గారు చెప్పినట్టు వేరే వేరే స్కిల్స్ ఉన్న అందరూ ఒక దగ్గరకి చేరి టీం ఏర్పడితే రెవెన్యూ అవకాశాలు పెరుగుతాయి అని ఒక దగ్గరకి చేరడానికి నా వంతు ప్రయత్నం సహాయ సహకారాలు ఉంటాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు,శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి మెంటాడ వెంకట స్వరూప్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు జగ్గురోతు విజయ్ గారు, బెవర ఉమ కుమారి, బురిడి త్రిమూర్తులు, కె.సూర్యారావుగారు, ఎల్. రంజిత్ కుమార్ గారు, కాలింగ డైరెక్టర్ బి. పద్మావతి గారు, కలిశెట్టి తాతారావు గారు, ఉండి వాసు గారు, బెవర శ్రీను,మెడపాడు రాజేష్, ముదిలి రామోజీ, నగేష్ గంగుల,గవర నవరాజు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సోషల్ మీడియా ఛాంపియన్స్ తదితరులు పాల్గొన్నారు.

20
17285 views
  
1 shares