కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం జిల్లా పొందూరు పర్యటనలో భాగంగా కలిసిన రాజాం ఎమ్మెల్యే.
పొందూరు ఖ్యాతి మరింత పెంచాలి హేండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... శ్రీకాకుళం
: పొందూరు ఖ్యాతి మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పొందూరులో చేనేత దినోత్సవ కార్యక్రమంలో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియను సీతారామన్ పరిశీలించారు. 50 నేత విధానాన్ని పరిశీలించారు.
ఖాదీ వడికే విధానం, చరఖాలను ఏర్పాటు చేశారు. ఖాదీ భవనం శిథలావస్థలో ఉండటం వలన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటి మొక్కల ప్రశస్తిని తెలిపారు. మహాత్మ గాంధి పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఖాదికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖాదీ బాగుపడాలనీ పిఎం చాలా పథకాలు ప్రకటించారని ఆమె అన్నారు. 2015వ సంవత్సరంలో ప్రధాన మంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినట్లు విరించారు. ఖాదీ కార్మికులు అభివృద్థి చెందాలని, ప్రత్యేకంగా బాగుపడాలనే ఆయన తపన అని చెప్పారు. తేనె ఉత్పత్తి ద్వారా అభివృద్థి చెందాలన్నారు. ఖాదీ పట్ల ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. పిఎం జాతీయ చేనేత దినోత్సవంను జరుపుకునే ఏర్పాట్లు చేశారనీ అన్నారు. 2014 సంవత్సరంలో రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18 వేల కోట్లకు పెరిగిందని ఆమె వివారించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేదని ఆమె పేర్కొంటూ మెగా హండ్లుమ్ క్లస్టర్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మంగళగిరిలో ఒక క్లస్టర్ వచ్చిందని, పొందూరులో సంఖ్య తక్కువగా ఉండటంతో క్లస్టర్ ఏర్పడలేదని గ్రహించినట్లు చెప్పారు. పొందూరులో క్లస్టర్ ఏర్పాటుకు టెక్స్ టైల్ మంత్రి తో మాట్లదాడుతామని మంత్రి తెలిపారు. ముద్ర లోన్ ల ద్వారా అనే రంగాలకు రుణాలు ఇవ్వవచ్చనీ, ప్రతి బ్యాంకు బ్రాంచ్ ద్వారా స్టాండ్ అప్ లోన్ ఇవ్వాలని ఆమె వివరించారు. 500 మంది చేనేత కారులు పొందూరులో ఉన్నారనీ వారికి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న లీడ్ బ్యాంక్ అధికారులను జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఎవరెవరికి ఏ ఏ ఋణాలు మంజూరు చేశారు, ఎందుకు ఇచ్చారో చర్చించాలని ఆమె కోరారు. ఎస్.సి., ఎస్.టి. మహిళలల్లో ఎవరికైనా ఒక బ్రాంచ్ లో లోన్ మంజూరు చేయవచ్చునని వెల్లడించారు. పొందూరు ఖాదీ అభివృద్థిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అడ్డు చెప్పదని, ఖాదీ అభివృద్థి చెందాలనే ఆకాంక్ష అన్ని రాజకీయ పార్టీలలో ఉందన్నారు. పొందూరు మరియు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారని, వారికి నాబార్డు బ్యాంకు, లీడ్ బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. బ్యాంకుల ద్వారా ఎంత మంది కార్మికులకు రుణాలు ఇచ్చారో బ్యాంకులు మరోసారి ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పెట్టాలని కోరారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తేదీ నాటికి 50 శాతం రుణాలు పెంచాలనీ బ్యాంకులను ఆదేశించారు. 3 వేల రాట్నాలు ఉండాలన్నారు. చేనేత వృత్తిని పెంచితేనే పొందూలో ఉన్న సమస్యలు తీరుతాయని చెప్పారు. జేమ్ - ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు అమ్మకాలకు మంచి ప్లాట్ ఫారం అని దానిలో పొందూరు ఖాదీనీ చేర్చాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. పొందూరు పేరెన్నిక గల ప్రదేశం అని, అందరికి మనసులో పొందూరు ఉందని అన్నారు. పొందూరు గ్రామంలో గడపడం ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసారు. ప్రదర్శనలను పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పొందూరు ఖద్దరు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్య్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. సూర్యోదయం నుండి శ్రమించే శ్రామికులు ఉన్నారని ఆయన పేర్కొంటూ చేనేత, ఖాదీనీ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నూలు పోగుతో సాంస్కృతిక బంధం ఉందన్నారు. గాంధీజీ తన కుమారుడిని పొందూరు పంపించి నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రతిభా పాటిల్ కూడా ఇక్కడి వస్త్రాలను ధరించేవారు. బిల్ క్లింటన్ సైతం ఖాదీ వస్త్రాలు చూసి మురిసి పోయారని చెప్పారు. నేతన్నకు ఆదాయం లేక, తగిన వసతి లేక నిరాశ నిస్పృహలకు లోను అవుతున్నారని చెప్పారు. ఖాదీనీ నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి చెదలు పట్టినట్లే అని ఆయన వివరించారు. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫేషన్ గా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. నేతన్నలకు ఆర్థిక సహాయంను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఖాదీ అభివృద్ధి సంస్థకు వై.యస్.ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందించామని తెలిపారు. ఖాదీ అభివృద్ధికి సహకరించాలని, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సామర్థ్యం పెంపు చేయాలని, ఆధునాతన పరికరాలు అందజేయాలని కోరారు. పొందూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పొందూరు ఖాదీ ఒక సాంప్రదాయం, సంస్కృతి అన్నారు. జియోగ్రాఫికల్ ఐడెన్ ఐడెంటిటి కల్పించాలన్నారు. ఖాదీ భవనం శిధిలావస్థకు చేరిపోతే రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో కార్మికులే నిధులు సమకూర్చుకొని పైకప్పులు వేసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమం ఆధారంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాదీ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఆర్థిక సహాయక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయం విధానం ద్వారా పారదర్శకంగా సామాజిక ఆడిట్ సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మార్పు రాగలదని భావిస్తున్నామని చెప్పారు. జిల్లాలో శత శాతం డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కొంత డిజిటలైజేషన్ ద్వారా ట్రాన్సెక్షన్ జరుగుతోందని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిరమ్మలా సీతారామన్ చేతుల మీదుకు స్వయం సహాయక సంఘాలకు 350 కోట్ల రూపాయల చెక్కు ఋణంగా అందజేశారు. ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం 200 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు ఋణాలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పార్లమెంట్ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు, బెల్లం చంద్రశేఖరరావు, శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, శాసన సభ్యులు గొర్లే కిరణ్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశ్ కౌశిక్, సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఆర్. శ్రీరాములు నాయుడు, ఆర్డీఓ ఐ. కిషోర్, వివిధ బ్యాంకుల అధికారులు సిజియం అండ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ వి. బ్రహ్మనంద రెడ్డి, నాబార్డ్ జియం ప్రమోద్ కుమార్ సోని, జియం ఎఫ్ఐ చౌదరీ పి. రామకృష్ణ, జనరల్ మేనేజర్లు కెఎస్డి సివ వర ప్రసాద్, మహ్మద్ విన్సెంట్, వివేక్ కుమార్, నాగరాజు, అమిత్ శ్రీవాత్సవ్, మన్మయ్య, ఎన్. రాజయ్య, డిజిఎంలు జి. గామి, పి. కృష్ణయ్య, బిజెఎ సుధాకర్, ఎన్. జెజేశ్వరరావు, సిజియం సుధీర్ కుమార్ జన్వర్, ఆప్కో చైర్మన్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పొందూరు మార్కెట్ యార్డులో వివిధ బ్యాంకులు, పొందూరు కార్మికులు ఏర్పాటు చేసిన ఖాదీ వస్త్రాలు, వివిధ స్టాల్స్ ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.