నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్
- సెట్ బాక్ లేకుండానే నిర్మాణం
-63వ జాతీయ రహదారి ప్రక్కనే అక్రమ నిర్మాణాలు
- జిల్లా కలెక్టర్ కు పిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్
- సెట్ బాక్ లేకుండానే నిర్మాణం
-63వ జాతీయ రహదారి ప్రక్కనే అక్రమ నిర్మాణాలు
- మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేసినా చర్యలు శూన్యం
- జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో మరోసారి పిర్యాదు
( - చుక్క గంగారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ - జగిత్యాల జిల్లా )/ మెట్ పల్లి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో 63వ జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి సెట్ బాక్ లేకుండానే బ్యాంకెట్ హాల్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని మరోసారి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో సోమవారం వంకాయల ముఖేష్ చంద్ర పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ బ్యాంకెట్ హాల్ ప్రక్క నుండి, పై నుండి విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు కూడా ఉన్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన గానీ, విద్యుత్ ప్రమాదాల వలన గానీ, ఇతర అనుకోని సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరిగితే అదుపు చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. గత ఏప్రిల్ 30న మెట్ పల్లి మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాంకెట్ హాల్ రాజకీయ ప్రముఖులకు చెందినదని అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మెట్పల్లి మున్సిపల్ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసి ఇప్పటికైనా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.