ఆళ్లగడ్డ అభివృద్ధిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమీక్ష.
AIMA న్యూస్.. నంద్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు.నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ అందేలా చూడాలని సూచించారు. ప్రజల సంక్షేమం, ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.