తహసిల్దార్ ని కలిసిన మండల టిడిపి నాయకులు
AIMA nsws
శ్రీకాకుళం జిల్లా :
కొత్తూరు మండలం :
కొత్తూరు మండల తహసీల్దార్గా పి.సరోజిని ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కొత్తూరు మండలం మెట్టూరు కూడలికి సంబందించిన టిడిపి నాయుకులు ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చుం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి కొత్తూరు మండల అభివృద్ధికి తమరు సహకారం అందించాలని కోరారు. ఈ తహసిల్దార్ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి జి.కమలాకర్ కొత్తూరు మండల ప్రధాన కార్యదర్శి మరియు పిఎసిఎస్ డైరెక్టర్ ఏ దశరథరావు కొత్తూరు మండల యూత్ అధ్యక్షులు వి.వెంకటరమణ టిడిపి సీనియర్ నాయకులు జి చంద్రమౌళి టిడిపి యువ నాయకులు మఠం జనార్దన రావు తదితరులు ఉన్నారు.