మియాపూర్ ప్రయాణికుల కష్టాలు గట్టెక్కించడానికి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన రేవంత్ రెడ్డి.......
తేది,08 -06 -2026: శేర్లింగంపల్లి చందానగర్: ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అనేక రకాల కార్యక్రమాలకు, దాదాపుగా 2000 కోట్ల రూపాయల అంచనాలతో కూడిన పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. లింగంపల్లి రెండువ ఓవర్ బ్రిడ్జి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, సైబరాబాద్ కమిషనరేట్ భవనాలు, మియాపూర్ నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు ఓవర్ బ్రిడ్జి పనులకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎంతో అత్యున్నత హృదయంతో శంకుస్థాపనలు చేసి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో అడుగులు వేస్తున్నారు. ఇంతకుముందు పరిపాలించిన నాయకులు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసిన దాఖలాలు కనిపించడం లేదని, ప్రజలు వాపోతున్న సందర్భంలో, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి చొరవతో, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేయడానికి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మియాపూర్ చౌరస్తాలోని న్యూ కాలనీ శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. ముందుగా లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు గారు మాట్లాడుతూ,రేవంత్ రెడ్డి గారికి ప్రజల తరఫున కొన్ని అభ్యర్థనలను విన్నవించారు. మీడియా మిత్రులకు కూడా కొంతమంది సొంతగృహాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తనకు విన్నవించారని, కావున వారి అభ్యర్థనను మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి వారి కోరికని తీరుస్తారని ఆశిస్తున్నాను అని శ్రీ అరికపూడి గాంధీ గారు తెలియజేశారు. అంతేకాదు మంజీరా లైను, వివిధ ప్రాంతాలలోని చెరువుల పూడికతీత, అభివృద్ధి పనులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చొరవతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. శేరిలింగంపల్లి అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నందుకు అరికపూడి గాంధీ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ప్రసంగిస్తూ ఇటు కొండాపూర్, ఆఫీస్ పెట్, మియాపూర్, చందానగర్, మీదుగా లింగంపల్లి వరకు అనేక రకాల అభివృద్ధి పనులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తే అవి తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వెనకడబోదని ఉద్ఘాటించారు.తదనంతరం. గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా పరిపాలన ప్రజల యొక్క ఆకాంక్షలు వారి ఆశయాలను ముందుకు నడిపించటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజలు ఇందుకు సహాయ సహకారాలు అందించి, ప్రభుత్వం ముందుకు నడవడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని విన్నవించారు.మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు ఓవర్ బ్రిడ్జిలు కానీ, చెరువుల పూడిక తీత,మొదలగు పనులు గాని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు దోహదపడే ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించడానికి, తీర్చడానికి ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు కాంగ్రెస్ నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.