ప్రియుడు కోసం పుట్టిన బిడ్డను.. కారు లో పెట్టి డోర్ వేసి చంపిన.. ప్రియరాలు..!!!
AIMA MEDIA :- బెంగుళూరు..విశాఖపట్నం.. విజయనగరం.. శ్రీకాకుళం...
ఐమా మీడియా :- బెంగళూరులో ప్రియాంక అనే మహిళ న్యాయవాది, ప్రియుడు మోహన్ తో కలిసి తన ఆరేళ్ల బిడ్డను చంపేసింది.ఇప్పుడు ఆధారాలతో సహా భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె పరారీలో ఉంది. ప్రియుడు మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అత్యంత ఘోరమైన ఈ కేసులో మాతృత్వానికే మచ్చ తెచ్చే విధంగా మహిళా న్యాయవాది వ్యవహరించి కన్న బిడ్డని ఒక పథకం ప్రకారం తన న్యాయవాద తెలివిని ఉపయోగించి చంపేసిన తీరు ఘోరంగా ఉంది. 17 ఏళ్ల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. ప్రియాంక భర్త దావణగెరెలో స్కూల్ నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో భార్య ప్రియాంకకు ఆమె కాలేజీలో స్నేహితుడు మరియు మాజీ ప్రియుడైన మోహన్ తో మళ్లీ పరిచయం కలిగింది . మోహన్ దాదాపు 1000 కోట్ల రూపాయల .రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు . మోహన్ తో మళ్ళీ సాన్నిహిత్యం కుదరడంతో ప్రియాంక క్రమంగా భర్తకు దూరమై మోహన్ తో సన్నిహితంగా ఉండసాగింది. ఈ పరిస్థితుల్లో ఓసారి ప్రియాంక బర్త్ డే సందర్భంగా అతడు ఆమెను దుబాయ్ కి తీసుకెళ్లి అక్కడ వైభవంగా వేడుకలు కూడా చేశాడు . దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోయింది. భర్త ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇద్దరు కూతుళ్లలో మొదటి కూతురు భర్త దగ్గరే ఉంది . ఆరేళ్ల రెండో కూతురు తల్లి ప్రియాంక దగ్గర ఉంది .అయితే మూడు నెలల క్రితం ఆ పాప అనూహ్య పరిస్థితిలో చనిపోయింది . పాప బర్త్ డే అని చెప్పి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లారు .అక్కడ పాపకు బిర్యాని కూల్ డ్రింకు పెట్టించారు. ఆ తర్వాత తీసుకొచ్చి కారులో పండబెట్టి మళ్లీ రెస్టారెంట్లోకి వెళ్లారు . కాసేపు ఏసివేసి , నిద్రపోయిన తరువాత ఎసి ఆఫ్ చేసి , కార్ డోర్స్ వేసి , మళ్ళీ రెస్టారెంట్ లోకి వెళ్లారు . కారులో ఇంటికెళ్లి, పాపను అలాగే తీసుకెళ్లి పడుకోబెట్టామని ,ఉదయానికి తన కూతురు చనిపోయిందని కారులో ఊపిరాడిక చనిపోయి ఉంటుందంటూ ప్రియాంక కబుర్లు చెప్పింది . పోస్ట్ మార్టం నివేదిక బయట వచ్చిన తర్వాత భర్త మోహన్ కు అనుమానాలు వచ్చాయి. దీంతో ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ తన సోదరి లండన్ లో ఉంటున్న చిల్డ్రన్ స్పెషలిస్ట్ కు పంపించాడు. ఆమె కొన్ని అభ్యంతరాలను అనుమానాలను లేవదీస్తూ సోదరుడికి ఇది సహజంగా జరిగిన మరణం కాదని వివరంగా చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు . పోలీసులు ప్రియుడు మోహన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే దారుణం మొత్తం వెలుగులోకి వచ్చింది. ప్రియాంక పరారీలో ఉంది. ప్రస్తుతానికి ప్రియాంక పరారీలో ఉంది.