నా లవర్ తో మన ఇంట్లో కాపురం చేస్తాను..!!! భావ
AIMA MEDIA :- నా లవర్ కూడా మనతో పాటి మన ఇంట్లో ఉంటేనే నేను నీతో కాపురం చేస్తా అని కండిషన్ పెట్టిన భార్య. సరే అని చెప్పి ఇద్దరినీ లేపేశాడు భర్త.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్: నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసును పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. జ్యోతి ప్రవర్తనతో విసిగివేసారిన ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. హత్య చేసిన అనంతరం విజయవాడకు పారిపోయిన నిందితుడు శ్రీనివాసరావును రాచకొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో మరెవరికీ ప్రమేయం లేదంటూ అతడు చెబుతున్నా... అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది... భార్య ప్రవర్తనతో విసుగుచెంది... వారాసిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు, జ్యోతి (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెకు ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ యడ్ల యశ్వంత్తో పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పలుమార్లు వాగ్వాదాలు,ఘర్షణలు జరిగియీ.మనము హ్యాపీ గా ఉందాము నీ ప్రవర్తన మార్చుకో అని చాలాసార్లు బుజ్జగించాడు. కానీ ప్రియుని మత్తులో ఉన్న భార్య ఒప్పుకోలేదు. ప్రియుడు కూడా మనతో పాటి మన ఇంట్లోనే ఉండాలి అని తెగించి చెప్పింది. అప్పుడు ఈ దారుణం జరిగింది.