logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిరుపతిలో డాక్టర్ మునిస్వామి యాదవ్ స్మరణ సభ ఘనంగా నిర్వహింపు

తిరుపతి: తిరుపతి జిల్లా వైద్యరంగానికి విశేష సేవలందించిన డాక్టర్ మునిస్వామి యాదవ్ గారి స్మరణార్థం ఏపీఎఫ్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ అకాడమి నిర్వహించింది. డాక్టర్ మునిస్వామి యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సంతాప సభలో మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం గారు ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాలని, వైద్య రంగంలో కొత్తవారికి మార్గదర్శకంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, టూరిజం డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, కళాకారులు, గాయకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

26
1045 views

Comment