బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్
కామారెడ్డి జిల్లా లో బాన్సువాడ, జూన్ 8: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో
బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీ వడ్ల సంఘం వేదికగా 13వ వార్డు సభ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవంతంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సభను నిర్వహించినట్లు 13వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. ఖలేక్, కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ తెలిపారు. 13వ వార్డు నాయకులు, ప్రజలు, అధికారుల సమక్షంలో జరిగిన ఈ సభలో వార్డు వాసులు ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్, జీరో కరెంట్ బిల్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ పనులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్, మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, సతీష్, విద్యుత్ శాఖ అధికారి జిలియ నాయక్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శోభ, విద్యాశాఖ నుంచి నరహరి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ రాములు, రెవెన్యూ జీపీఓ అర్జున్, రెప్రజెంటేటివ్ మెంబర్ వాణి పాల్గొన్నారు.
వార్డు సభను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులు, నాయకులకు కౌన్సిలర్ ఎం.ఏ. ఖలేక్, కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.