హనుమాన్ శోభాయాత్రకు భారీ పోలీసు బందోబస్తు
పెనుకొండ, జూన్ 7: పెనుకొండలో ఆదివారం నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రాఘవన్ తెలిపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ Satish Kumar ఆదేశాల మేరకు డీఎస్పీ Narsingappa పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసులు, హోంగార్డులు, ప్రత్యేక బెటాలియన్ సిబ్బంది కలిపి సుమారు 170 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు వెల్లడించారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010