లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తొలిసారిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు.
ఆలయంలోని వేలాడే స్తంభం, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, తైల చిత్రాలు, శిల్పకళా వైభవాన్ని పరిశీలించిన మంత్రి వాటి ప్రత్యేకతను కొనియాడారు. లేపాక్షి ఆలయం అద్భుత శిల్ప సంపదకు నిలయమని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ క్షేత్రం భారతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010