logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సోమందేపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

సోమందేపల్లి, జూన్ 7 (AIMA MEDIA ): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాల పరిశీలన చేపట్టనున్నట్లు తహసీల్దార్, ఏఈఆర్‌వో తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందజేయనున్నారని పేర్కొన్నారు. ఫారంపై పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులందరి ఫోటోలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం, పారదర్శకత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి మండల ప్రజలు సహకరించాలని కోరారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

9
740 views

Comment