7వ వార్డులో శ్రీకృష్ణ భజన్ మందిరం వద్ద99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ
ఇల్లందు పట్టణంలోని 7వ వార్డులో ‘99 రోజుల ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు *శ్రీ కృష్ణ భజన మందిరం* నందు వార్డు సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.
7వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ గోపగాని రాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు, ఎల్లందు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ సందీప్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు మాట్లాడుతూ “ *కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డు ప్రజలు అధికారులకు, వార్డు కౌన్సిలర్‌కు పూర్తిగా సహకరించాలి” అని కోరారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్.బోళ్ల సూర్యం గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి కాజా గౌస్ మునిద్దీన్ ఎండి ఇబ్రహీం ఎండి ముజీబ్
జడల బలరాం గారు మరియు
కో ఆప్షన్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజూరి మంజుల, సలేంద్ర లక్ష్మీ , వ వార్డు ప్రజలు మరియు సుద్దాల అరుణ, జడల కృష్ణవేణి సలేంద్ర వెంకన్న, ఎండి ముజీబ్ , జడల బలరాం, బొల్లం సత్యం, సుమన్ , సోయఫ్, వార్డు ఆర్.పి, వార్డు ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్డు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.