సర్వాంతర్యామి రెండో షేడ్యూల్డ్ ప్రారంభం
సర్వాంతర్యామి రెండో షేడ్యూల్ 10 జూన్ 2026 నుండి ప్రారంబిస్తున్నటుగా డైరెక్టర్ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ తెలిపారు . కళా కుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ బ్యానర్ మీద ఈ ఫిల్మ్ గత నెల 21న ప్రారంభించామని , ఇందులో నటీ,నటులు తాము గతంలో 3 రోజుల యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించి , అందులో నుండి ప్రతిభ గల నటీ ,నటులను తీసుకుని ఈ ఫిల్మ్ చేస్తునట్టుగా తెలిపారు . ఈ ఫిల్మ్ మొదటి షేడ్యూల్ గతనెల 20 న ప్రారంభించామని , రెండు పాటలు , కొన్ని సీన్స్ తీశామని ,మిగిలినవి రెండో షెడ్యూల్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దేవుడు లేదనే వ్యక్తి , చివరికి దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతాడు అనే ఇతివృతం ఆధారంగా తాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నటుగా తెలిపారు . ఈ చిత్రంలో హరగోపాల్ గారు , డాక్టర్ రియాజ్ అహ్మద్ గారు అన్నదానం శర్మ గారు , వెంకట్ ,మోహన్ , వాసు , ఆలూరి రమేష్ బాబు తదితరులు ఇప్పటివరకు నటించారని ఇంకా కొంతమంది కళాకారులు నటించాల్సిన అవసరం ఉందని అన్నారు . ఈ చిత్రానికి కెమెరా , ఎడిటింగ్ , కథ , మాటలు , దర్శకత్వ బాధ్యతలను సంస్థ డైరెక్టర్ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేస్తామని తెలిపారు