logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


తేది:05.06.2026
కామారెడ్డి జిల్లా
శుక్రవారం

రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

అకాల వర్షాల కారణంగా ఈ నెల 5వ తేదీ వరకు పూర్తికావలసిన కొనుగోలు ప్రక్రియ 10వ తేదీలోగా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి డివిజన్‌లో గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 800 మెట్రిక్ టన్నుల వరి తడిసిపోవడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి రామేశ్వర్‌పల్లి ప్యాడీ పర్చేజ్ సెంటర్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు

ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా తగిన సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి తడిసిన వరిని అత్యవసరంగా రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా మేనేజర్ శ్రీకాంత్ , జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, dco రామ్మోహన్ రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం సిద్ధిరామేశ్వర రైస్ మిల్లులో ఆరు పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

తడిసిన వరిని వెంటనే అన్‌లోడ్ చేసి స్వీకరించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి సహకారం అందించాలని సూచించారు.

తమ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన 14 మంది రైస్ మిల్లర్ల పై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియకు సహకరించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ప్రస్తుత తేదీ నాటికి జిల్లాలో మొత్తం 4,19,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి సకాలంలో తరలించేందుకు అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

35
1076 views

Comment