జూట్ బ్యాగులు, పర్యావరణహిత వస్తువులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పత్రిక ప్రకటన
తేది: 05.06.2026
కామారెడ్డి జిల్లా
శుక్రవారం
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
జూట్ బ్యాగులు, పర్యావరణహిత వస్తువులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని "ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జూట్ బ్యాగులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి తిరుమల , జిల్లా పంచాయతీ , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖల సిబ్బందికి పర్యావరణహిత జూట్ బ్యాగులను టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లను అందజేశారు.
రోజువారీ జీవితంలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వి. గిరి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.