logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లేపాక్షిలో యోగాంధ్ర విజయవంతం చేయండి: కలెక్టర్

లేపాక్షి, జూన్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని జూన్ 7న లేపాక్షిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సూచించారు. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం ప్రాంగణంలో జరుగనున్న కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
వేదిక, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి యువత, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

41
1560 views

Comment