మహిళా భద్రతపై శక్తి టీం అవగాహన
పరిగి, జూన్ 5: మహిళా ఉద్యోగులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, శక్తి టీం 24 గంటలూ అందుబాటులో ఉంటారని పీకేడీ ఎస్డీ శక్తి టీం-1 సభ్యులు తెలిపారు. పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ గార్మెంట్స్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మహిళల భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, అత్యవసర సహాయక సేవలపై అవగాహన కల్పించారు.
18 ఏళ్లలోపు బాలికలను మైనర్లుగా పరిగణిస్తారని, వారిపై జరిగే నేరాలకు పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం, ఫోటోలు తదితరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా మోసాలు, సైబర్ వేధింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పని ప్రదేశంలో వేధింపులు ఎదురైనా వెంటనే 181, 112 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. శక్తి యాప్ వినియోగం, SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ షెల్టర్ వంటి సదుపాయాలపై మహిళా ఉద్యోగులకు వివరించారు. కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు రేణుక, హెచ్‌సీ మహేష్, హెచ్‌సీ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010