విద్యార్థులకు ఫూలే-అంబేద్కర్ ప్రతిభ పురస్కారాలు
పెనుకొండ, జూన్ 5: బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ జన్మదినం సందర్భంగా శుక్రవారం పెనుకొండలోని గోల్డెన్ ఎంపైర్ ఫంక్షన్ హాల్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన సుమారు 150 మంది విద్యార్థులకు మహాత్మా జ్యోతిరావు ఫూలే–డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ పురస్కారాలను అందజేశారు. విద్యార్థులను మెమెంటోలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతిభను గుర్తించి విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో గత నాలుగేళ్లుగా తన జన్మదినాన ఈ పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం శివరామకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు, సభ్యులు గజమాలలు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీకే సాయి కళ్యాణ్, రాజ్ కుళ్లాయప్ప, హనుమంతు, రవికుమార్, రంగేపల్లి నాగరాజు, ఆనంద్, నాగార్జున, ఈశ్వర్, రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010