మహిళలు ఆర్థికంగా ఎదగాలి : పీఎసీఎస్ ఛైర్మన్ పాలేపు చంద్రశేఖర్
సూర్యాపేట:తిరుమలగిరి మండల కేంద్రంలోని మార్పు సొసైటీ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు పీఎసీఎస్ ఛైర్మన్ పాలేపు చంద్రశేఖర్ సర్టిఫికెట్లు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.మహిళలు కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని, కుటుంబ పోషణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండి, రాజకీయ రంగంలో కూడా తమదైన ముద్ర వేయాలని సూచించారు.
కుట్టు శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని, తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి ఎదగాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ అధ్యక్షుడు పోరెళ్ల విప్లవ్ కుమార్, మహిళా నాయకురాలు ముద్రబోయిన పూలమ్మ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు కందుకూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళలు కూడా కార్యక్రమంలో హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.