ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపు స్థానిక ఎన్నికలకి సిద్ధం కావాలి
ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, విద్యా, రైతు, మహిళా మరియు సామాజిక భద్రతా కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ గ్రామాన పర్యటించి, ప్రజలలో చైతన్యాన్ని కలిగించి, అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అందించాలి. గ్రామాల్లో లోటుపాట్లను సేకరించి, 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రద్ధగా పనిచేయాలని పార్టీ కోరుతోంది. ఈ పిలుపులో LNపేట మాజీ మండల అధ్యక్షులు శివాల బాబు కిషోర్ కుమార్, మాజీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాకుళం గుండప్రామారావు, మోదుగువలస ఎక్స్ సర్పంచ్, ప్రస్తుత నీటి సంఘం అధ్యక్షులు మరియు ఇతర BOOTH ఇంచార్జీలు, నేతలు పాల్గొంటున్నారు.