logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పలమనేరు: విద్యార్థులకు రోజుకు సూక్తి ద్వారా మేధో వికాసం

పలమనేరు: తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పి. తులసినాథం నాయుడు శుక్రవారం పలమనేరు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు రోజుకు సూక్తి నేర్పడం ద్వారా మేధో వికాసం కలుగుతుందని తెలిపారు. ఆయన జ్ఞాన దీపాలు, నీతి పద్యాలు పుస్తకాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు.

పలమనేరు మండల విద్యాశాఖ అధికారి బాలసుందరం, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి వారానికి ఒక నీతి పద్యం నేర్పించి విద్యార్థులు సంవత్సరంలో 50 పద్యాలు నేర్చుకుంటారని, వారు అన్ని విషయాలలో ముందుంటారని తెలిపారు. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి లక్షలాది పుస్తకాలను ఉచితంగా అందిస్తూ, ఉపాధ్యాయులు మంచి విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శశికుమార్, సురేఖ వీ కోట, బైరెడ్డిపల్లి, బంగారు పాళ్యం మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

22
1363 views

Comment