ఆళ్లగడ్డలో అర్జీల వెల్లువ: సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా..ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే “వన్ మంత్ - ఫోర్ విజిట్” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలతో కలిసి ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ముఖ్యంగా పెన్షన్లు, భూ సమస్యలు, గృహాలు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.