పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఆర్డీవో సువర్ణ
పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆర్డీవో సువర్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రత పాటించడం ద్వారా భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010