logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజలకు బాబు చేసిన మోసాలకు రెండేళ్లు కొత్తూరులో వైయస్సార్సీపి శ్రేణుల ఆందోళన

AIMA news : మండల ప్రధాన కేంద్రమైన కొత్తూరులో రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ.. మండల అధ్యక్షులు ఆనందరావు ఆధ్వర్యంలో బాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నలుమూలల నుండి వైయస్సార్ సిపి శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని వైయస్సార్సీపి శ్రేణులు అన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర మరియు మండల నాయకులతో పాటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

9
834 views

Comment