సాయి ఆలయంలో అన్నదానం
కుమారుడి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం
(AIMA MEDIA ) సోమందేపల్లి జూన్ 4 :
సోమందేపల్లి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మణి గార్మెంట్స్ నిర్వాహకుడు, మాస్టర్ వీవర్ మణి తన ద్వితీయ కుమారుడు నవీన్–సింధు దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేపట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులు మణి కుటుంబ సభ్యులను అభినందించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010