ఓట్ మ్యాపింగ్పై టీడీపీ నేతల సమీక్ష
సోమందేపల్లి, జూన్ 4: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఓట్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ ఆర్. వెంకటరమణ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు పాల్గొని పార్టీ బలోపేతం, ఓటర్ల వివరాల నవీకరణ, బూత్ స్థాయి నిర్వహణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్, ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు భానుకీర్తి, స్వామి, సిద్ధలింగప్ప, రామకృష్ణ, సోమందేపల్లి టౌన్ అధ్యక్షుడు వడ్డీ సురేష్‌తో పాటు పంచాయతీ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010