logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ.హోరెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు.

AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో గురువారం రోజున. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో భారీ నిరసన, బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైసిపి పార్టీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల వేళ ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను ఘోరంగా వంచించిందని ధ్వజమెత్తారు. మహిళలకు ₹1500 సహాయం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాలను పూర్తిగా విఫలం చేశారని విమర్శించారు. రెండేళ్లుగా సంక్షేమాన్ని వదిలేసి కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, రైతులు, యువత సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. తక్షణమే హామీలను నెరవేర్చకపోతే ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

4
1781 views

Comment