వెన్నుపోటుకు రెండేళ్లు.. వైసీపీ నిరసన
సోమందేపల్లి, జూన్ 4: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సోమందేపల్లిలో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నరసింహామూర్తి, కంబాలప్ప మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010