కామారెడ్డి పట్టణ కేంద్రంలో మహిళ దారుణ హత్య
కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో 40 ఏళ్ల నరసాపురం శ్యామల అనే మహిళ దారుణ హత్యకు గురైందని కూలి పని కోసం కామారెడ్డికి భార్యాభర్తలిద్దరూ వచ్చారు. ఆమె గత నెల 31న ఇంటికి తిరిగి వెళ్లలేదు. భర్త రాజం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు బుధవారం గుర్తించారు.సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.