ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్లో 'పెద్ది' హంగామా: పూనకాలతో ఊగిపోయిన అభిమానులు!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. నిన్న రాత్రి బుధవారం .ఆళ్లగడ్డలోని స్థానిక ప్రతాప్ థియేటర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ ప్రీమియర్ షో అత్యంత ఘనంగా ప్రదర్శితమైంది. సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు థియేటర్ ప్రాంగణంలో సంబరాలు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రామ్ చరణ్ మాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రతాప్ థియేటర్ విజిల్స్, పేపర్ ముక్కలతో దద్దరిల్లిపోయింది.ఆర్ఆర్ఆర్ తర్వాత పర్ఫెక్ట్ బొమ్మ! గ్లోబల్ స్టార్ రేంజ్‌కి తగ్గ పవర్‌ఫుల్ స్టోరీ ఇది. డైలాగ్స్ చాలా గంభీరంగా ఉన్నాయి. చరణ్ నటన, ఆయన డ్యాన్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటివి.BGM అదిరిపోయింది! థియేటర్‌లో సౌండ్ సిస్టమ్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఆళ్లగడ్డ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. మొత్తానికి ప్రతాప్ థియేటర్ వేదికగా ఆళ్లగడ్డ మెగా అభిమానులు 'పెద్ది' ప్రీమియర్ షోతో థియేటర్ దగ్గర పండగ వాతావరణాన్ని తలపించేలా హల్‌చల్ చేశారు.