logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు సింగరేణి జిఎం కార్యాలయం ముందు ఆందోళన

ఇల్లందు: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామకాల ఉత్తర్వులు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు సింగరేణి జిఎం కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటియుసి నాయకులు సారయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా మెడికల్ అయినా డిపెండెంట్ ఉద్యోగులు వారి పిల్లల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని పలుమార్లు గుర్తింపు సంఘం గా తాము యాజమాన్యాన్ని కోరుతున్న ఉత్తర్వులు విడుదల చేయడం లేదని, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, మెడికల్ అయిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో డిపెండెంట్ ఉద్యోగాల పరిష్కారంతోపాటు,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో దశల వారి ఉద్యమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. అనంతరం సింగరేణి జిఎం ఈసం కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమం ఏఐటీయూసీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

7
498 views

Comment