AVANIGADDA(AP) MLA DISTRIBUTED CMRF CHECKS
*పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు గారు తొలి ప్రాధాన్యత*
*సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు*
*72 మంది లబ్ధిదారులకు రూ.66,56,190ల సహాయం*
*కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1,464 మందికి రూ.12,16,40,751లు ఆర్థిక సహాయం*
పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు గారు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు రూ.66,56,190ల సహాయం చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు గారు పేదల వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి ఉదారంగా సహాయం అందిస్తున్నారని తెలిపారు. పేదలు తమ వైద్య ఖర్చుల కోసం తమ కార్యాలయం ద్వారా సమర్పించే దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో 1,464 మందికి రూ.12,16,40,751లు ఆర్థిక సహాయాన్ని పేదల వైద్యానికి అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.