పేదలకు సహాయంగా ఉంటామని మరోసారి నిరూపించుకున్న హెచ్ఆర్సీఐ
క్రౌన్ హ్యూమన్ రైట్స్ రాజమండ్రి జూన్ 02;
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కర్రీ దాసు మంగళవారం రోజున తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం రఘునాథపురం గ్రామంలోని ఇద్దరికీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరుపున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ రిజిస్టర్ రాఘవులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పేదల విషయాల్లో తమ ఎంతో ముందుంటామని మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాకుండా హెచ్ఆర్సిఐ సభ్యులు ఎంతో స్వేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఆ సంస్థ యొక్క జాతీయ అధ్యక్షులు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె దాసుపై ఉన్న నమ్మకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కె దాసు చేతుల మీద ఉండా సూర్యకాంతం కి మరియు హైకోర్టు సీనియర్ రిజిస్టర్ రాఘవులు చేతుల మీద ఉండా సత్తి బాబుకి ఇరువురికి 2000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సిఐ సభ్యులు చైతన్య, ప్రదీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.