జెండా ఆవిష్కరించిన వనమా రాఘవ
తెలంగాణ ఉద్యమంలో భద్రాచలం సబ్ జైల్లో వనమా రాఘవ
కొత్తగూడెం జూన్ 2 (): భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత పాల్వంచ లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రవు పాత పాల్వంచలో జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సుజాతనగర్ వేపలగడ్డలో బిఆర్ఎస్ పార్టీ నూతన దిమ్మ కార్యక్రమంలో పాల్గొని నూతన దిమ్మ ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన వనమా రాఘవేంద్రరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలి దశ ఉద్యమానికి కెసిఆర్ పెడికెళ్లి బిగించి గులాబీ జెండా ఎత్తారని సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చేందుకు కెసిఆర్ తో కలిసి అందరం నడుస్తున్నామని తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసేందుకు అనేక పదవులు కేసీఆర్ త్యాగం చేశారని సంపాండ వర్గాలు కేసీఆర్ తో కలిసి నడిచి పోరాటంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా భద్రాచలం సబ్ జైల్లో ఆరు రోజులు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాలుపంచుకున్నానని ఈ సందర్భంగా పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసినారు. ఆనాడు వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచశారని కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం జరిగిందని తెలంగాణ రావడంలో నేను జైలుకుపోవడం చాలా సంతోషమని వారు అన్నారు. వనమా వెంకటేశ్వరరావు నివాసం నుండి భారీ వాహనాలతో నవభారత్ లో జెండా ఆవిష్కరించి అనంతరం కొత్తగూడెం మీదుగా సుజాతనగర్ మండలం వేపలగడ్డలో బిఆర్ఎస్ పార్టీ జెండా ప్రారంభించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు సర్పంచులు ఉపసర్పంచ్ వనమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు